విమాన ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త. ఎందుకని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. అదిరిపోయే టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ విమానయాన కంపెనీలలో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న విస్తారా ఎయిర్‌లైన్స్ తాజాగా అదిరే ఆఫర్ తీసుకువచ్చింది. డిస్కౌంట్ ధరకే విమాన టికెట్లు అందిస్తోంది. దీని కోసం కంపెనీ ప్రత్యేకంగా వింటర్ సేల్ నిర్వహిస్తోంది. అందువల్ల విమాన ప్రయాణం చేయాలని భావించే వారు ఈ ఆఫర్ కింద తక్కువ ధరకే ఫ్లైట్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
విస్తారా వింటర్ సేల్ పరిమిత కాలం వరకే అందుబాటులో ఉంటుంది. అలాగే పరిమిత సంఖ్యలో సీట్లకు మాత్రమే ఆఫర్ వర్తించొచ్చు. అందువల్ల ఎవరైతే ముందుగా టికెట్లు బుక్ చేసుకుంటారో వారికే ఆఫర్ వర్తించే ఛాన్స్ ఉంటుంది. ఈ విస్తారా వింటర్ సేల్‌లో భాగంగా మీరు ఫ్లైట్ టికెట్లను రూ. 1923 ప్రారంభ ధరతో బుక్ చేసుకోవచ్చు. డొమెస్టిక్ రూట్లకు మాత్రమే ఈ ఫ్లైట్ టికెట్ బుకింగ్ ఆఫర్ వర్తిస్తుంది. వన్ వే రూట్‌కు ఈ రేటు వర్తిస్తుందని కంపెనీ పేర్కొంటోంది.
సంబంధిత వార్తలు
వింటర్ సేల్‌లో భాగంగా ప్రయాణికులు స్పెషల్ డొమెస్టిక్ రేట్లతో ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపింది. వన్‌వే డొమెస్టిక్ ధరలు రూ. 1923 నుంచి ప్రారంభం అవుతాయని పేర్కొంది. ఈ ఆఫర్ డిసెంబర్ 10 వరకే అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. అంటే మూడు రోజులు ఈ సేల్ నడుస్తుంది. ఆఫర్లో భాగంగా విమాన టికెట్లు బుక్ చేసుకోవాలని భావించే వారు డిసెంబర్ 11 నుంచి 2024 సెప్టెంబర్ 30 వరకు ఎప్పుడైనా జర్నీ ప్లాన్ చేసుకోవచ్చు.
శుభవార్త.. రూ.3,500 పతనమైన వెండి.. బంగారం ధరలు ఎంత తగ్గాయంటే..
ఈ ప్రమోషనల్ ఆఫర్ కేవలం డైరెక్ట్ ఫ్లైట్స్‌కు మాత్రమే వర్తిస్తుంది. ఎకానమీ, ప్రీమియం ఎకానమీ, బిజినెస్ క్లాస్ టికెట్లను ఆఫర్లో భాగంగా బుక్ చేసుకోవచ్చు. రూ. 1923 ధర అనేది ఎకానమీ క్లాస్‌కు వర్తిస్తుంది. అదే ప్రీమియం ఎకానమీ క్లాస్ టికెట్ అయితే రూ. 2323 నుంచి ప్రారంభం అవుతోంది. ఇక బిజినెస్ క్లాస్ టికెట్ రేటు అయితే రూ. 9923 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ అనేది కేవలం బేస్ ఫేర్‌కు మాత్రమే వర్తిస్తుంది. అంటే అదనపు చార్జీలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. అప్పుడు టికెట్ రేటు పైకి చేరుతుంది. అలాగే ఈ ఆఫర్ ఎంపిక చేసిన రూట్లకు మాత్రమే వర్తిస్తుందని గుర్తించుకోవాలి. కంపెనీ ఆఫర్ ముగిసిన తర్వాత రెగ్యులర్ టికెట్ రేట్లు వర్తిస్తాయి. ఈ ఆఫర్ కంపెనీ వెబ్సైట్లో అందుబాటులో ఉంది.
అగ్ర వీడియోలు
-
December 8, 2023, 8:12 pm IST
మహిళలకు ఉచిత ప్రయాణం.. రేపు ఎన్ని గంటల నుంచి ఫ్రీగా బస్ ఎక్కొచ్చంటే..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..
- First Published :